సంఘటనలు / Events
108 నక్షత్ర పాద శివలింగాలు యొక్క Ebook ఉచితంగా Download చేసుకోండి
సంఘటనలు / Events
NFCL మూర్తి గారి ఆధ్వర్యంలో ది. 03.07.2022 ఆదివారము జరిగిన దక్షిణకాశీ శ్రీ దక్షారామం యాత్రకు అనూహ్య స్పందనతో 75 మంది భక్తులు
జై మాణిక్యాంబా సమేత భీమనాథాయ నమః
ప్రియ భగవత్ బంధువులారా, శ్రీ మాణిక్యాంబా సమేత భీమనాథుని అనుగ్రహంతో , NFCL మూర్తి గారి ఆధ్వర్యంలో ది. 03.07.2022 ఆదివారము జరిగిన దక్షిణకాశీ శ్రీ దక్షారామం యాత్రకు అనూహ్య స్పందనతో 75 మంది భక్తులు విచ్చేయడం మాకు ఆనందాన్ని కలుగ చేసింది. ఈ యాత్ర లో ముందుగా మీకు తెలియ చేసినట్లుగా ద్వాదశ తీర్థాలు పంచ తీర్థాలే కాకుండా అష్ట దిక్కులలో కల అమ్మవార్లను కూడా చూపిస్తూ ప్రతీచోటా వాటి విశిష్టతను మహిమనూ వివరిస్తూ అవకాశం వున్న చోట్ల స్పర్శ దర్శనములు కూడా చేయించడం జరిగింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా యాత్రను ఫలప్రదం చేసికొనినందులకు భక్తులందరికీ మాయొక్క అభినందనలు తెలియచేస్తున్నాము. ఆ మాణిక్యాంబ సమేత భీమ నాధుని అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై వుండాలని ప్రార్ధిస్తున్నాము.
ఆత్మీయ ఆహ్వానం
బ్రహ్మర్షి పితామహా పత్రీజీ ఆశీస్సులతో
భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం లో భాగం గా "108 నక్షత్ర పాద శివాలయలలో" జులై 7 నుండి ఆగస్టు 2 తేదీ వరకు, 27 రోజులు జరిగే "శకహార -- ధ్యాన -- శాంతి -- సౌభాగ్య సాధన -- యాత్ర " గురించి విధి - విధానాలు చర్చించేందుకు ఈ సమావేశం, ది 1/7/22 శుక్రవారం సాయంత్రం 4 గం నుండి 6 గం " వరకు సమావేశం "ద్రాక్షారామ ధ్యాన కేంద్రం" నందు జరుగుతుంది. కాబట్టి ఆత్మీయలు అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావలసినదిగా కోరుచున్నాము.
స్థలం : ద్రాక్షారామ, శ్రీ భీమేశ్వరస్వామి గుడి, పడమటి గోపురం ప్రక్క, మేడపైనా...
ద్రాక్షారామ ధ్యాన మందిరం వివరాలు
త్వరలో వస్తుంది
ద్రాక్షారామం-108 పాద శివలింగాలు - యాత్రా దర్శిని
రచన: కె.కె. మంగపతి, కాకినాడ, సెల్: 91105 82156
ప్రథమ ముద్రణ: 2025 (జున్)
పుస్తకం వెల: అమూల్యం
మూలం: శ్రీ తాళ్ళ సాంబశివరావు గారి "శ్రీ భీమేశ్వర సందర్శనం"
ప్రచరణ కర్త: Dr. గరికిపర్తి నమశ్శివాయ, KSN, కాకినాడ, సెల్: 99519 54256
ముద్రణ: పద్మనాభ ఆఫ్ సెట్ ప్రింటర్స్, నాగేశ్వరరావు వీధి, రామారావు పేట, కాకినాడ - 533 004
ఫోన్: 0884 6588013, 93979 50719
విషయసూచిక
1. ద్రాక్షారామం, 108 పాద శివలింగాలు , 2. మేషరాశి ఆలయాలు, 3. వృషభరాశి ఆలయాలు, 4. మిధునరాశి ఆలయాలు, 5. కర్కాటకరాశి ఆలయాలు, 6. సింహరాశి ఆలయాలు, 7. కన్యారాశి ఆలయాలు, 8. తులరాశి ఆలయాలు, 9. వృశ్చికరాశి ఆలయాలు, 10. దనుస్సురాశి ఆలయాలు, 11. మకరరాశి ఆలయాలు, 12. కుంభరాశి ఆలయాలు, 13. మీన రాశి ఆలయాలు, 14. పన్నెండు రాశులు - శివ లింగాలు, 15. ద్వాదశ లింగములు, 16. పంచ తీర్ధములు
అష్ట సోమేశ్వరాలయాలు, కోనసీమ ఏకాదశ రుద్రులు, పార్వతీ కుండలేశ్వర స్వామి, కుండలేశ్వరం, పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమి మొదలగునవి ఉంటాయి.